బీజేపీ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌..

96
- Advertisement -

తెలంగాణ‌లో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ధ్వజమెత్తారు.ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని.. నిన్న కేసీఅర్ రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారని కవిత పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌రో నీతి ఉండ‌కూడ‌ద‌ని ఆమె తెలిపారు. కేంద్రం పంజాబ్‌లో వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసిన‌ట్లే తెలంగాణ‌లోనూ మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఒక దేశం ఒకే సేక‌ర‌ణ విధానాన్నే తాము డిమాండ్ చేస్తున్నామ‌ని ఆమె తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల‌ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ స‌ర్కారు యుద్ధాన్ని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

- Advertisement -