తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ విడుదల..

68
- Advertisement -

మంగళవారం తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 13న ఈసెట్ జరగనుండగా, జులై 14 నుంచి ఎంసెట్ షురూ కానుంది. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరపనున్నారు. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఖరారైన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ ఎంసెట్ పరీక్షలు 28 ప్రాంతీయ సెంటర్లలో 105 కేంద్రాల్లో జరపనున్నారు. అందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

- Advertisement -