- Advertisement -
సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలపై నిరాధారమైన ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న బిజెపి నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ జితేందర్ ని కలిసి వినతి పత్రం అందించారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. .
దళిత నాయకులను అవమానించేలా పోస్టులు పెట్టే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు. అడిషనల్ డీజీని కలిసిన వారిలో ఎమ్మెల్యే బాల్క సుమన్,ఆరూరి రమేష్, మెతుకు ఆనంద్,క్రాంతి కిరణ్,ఎంపీ వెంకటేష్ ఉన్నారు.
- Advertisement -