టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురిని రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరగా దీనిని రిజెక్ట్ చేశారు ఏసీబీ న్యాయమూర్తి. సరైన ఆధారాలు లేవని అందుకే రిమాండ్ తిరస్కరిస్తున్నట్లు తెలిపారు న్యాయమూర్తి. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ ఈకేసులో అప్లికెబుల్ కాదన్నారు.బ్రైబ్ అమౌంట్ లేక పోవటంతో రిమాండ్ తోసిపుచ్చారు ఏసీబీ న్యాయమూర్తి. 41crpc నోటీస్ ఇచ్చి విచారించాలని తెలిపారు న్యాయమూర్తి.
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల డీల్‌తో ముందుకొచ్చిన వ్యవహారంలో ఆడియో క్లిప్ కీలకంగా మారింది. బీజేపీ కీలక నేతలతో ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఎమ్మెల్యేలు రికార్డు చేయగా, ఎమ్మెల్యేల సమక్షంలోనే మాట్లాడుతున్న ఈ ఆడియోలను పోలీసులు వీడియోగ్రఫీ చేశారు. ఇక 88 సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది.
ఎమ్మెల్యేలతో కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 నాయకుడితో మాట్లాడించే ప్రయత్నం చేశారు నంద కుమార్. అలాగే ఫార్మ్ హౌస్ లోని గంట 20 నిమిషాల గలా సీసీ కెమెరా టేప్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలుపై సర్వాత్ర నిరసనలు వస్తున్నాయి. బీజేపీ నేతల తీరును ఎండగడుతూ ప్రధాని దిష్టిబొమ్మను దగ్దం చేశారు ప్రజలు.
ఇవి కూడా చదవండి..