బీజేపీ తెచ్చిన విద్యుత్ బిల్లు రైతుల పాలిట శాపం..

117
mla kranthi

సిద్దిపేట పట్టణంలోని అక్షయ గ్రాండ్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తెచ్చిన ఉద్యుత్ బిల్లుపై టిఆర్ఎస్ నేతల మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. బీజేపీ తెచ్చిన విద్యుత్ బిల్లు రైతుల పాలిట శాపం. బీజేపీ నేతలవి బుకాయింపు మాటలని విమర్శించారు. మీరు తెచ్చిన చట్టంలోనే వినియోగదారు చార్జీలు చెల్లించాలని స్పష్టంగా ఉంది. బిల్లుకు ఆమోదం తెలిపితే రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందిస్తామంటూ ఆఫర్లు ఇచ్చారన్నారు. మీరు తెచ్చిందే రైతు, గిరిజన, బలహీన వర్గాల వ్యతిరేక బిల్లు అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.

ఫార్మర్స్ డిస్కం లకు చార్జీలు చెల్లించాలని బిల్లులోనే ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు ల సంక్షేమం ప్రధానంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్రం తెచ్చిన బిల్లు పూర్తిగా రైతు వ్యతిరేక బిల్లు, దీన్ని ఊపసంహరించు కోవాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి, పీఎం మోడీకి లేఖ రాశారు. పక్క రాష్ట్రంలో మిటర్లు పెట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తన్నాయన్నారు. బీజేపీ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ బిల్లుతో ఒక్క దుబ్బాకలోనే 100 కోట్ల భారం పడుతుంది. కేంద్రం గ్యాస్ సిలిండర్లకు పరిమితి విధించింది.. అలాగే కరెంట్ వినియగం విషయంలోనూ పరిమితి విధిస్తే రైతు పరిస్థితి ఏమిటి ? అని ప్రశ్నించారు. బీజేపీ నేత రఘునందన్ రావు మాటలు పచ్చి బూటకమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మండిపడ్డారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో రఘునందన్ రావు పోటీ చేసి ఓడారు.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు ప్రజల బుద్ది చెప్పారు. ఇప్పుడు కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా యావత్ దేశం ధర్నాలు, రాస్తారోకోలతో అతలకుతం అవుతున్నది. బిల్లుకు వ్యతిరేకంగా స్వయంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి చూశాం. దేశంలోని స్వయంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ బిల్లుపై వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు కేంద్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.