దుబ్బాకలో కాంగ్రెస్‌కు మరోషాక్‌..

107
trs

రాష్ట్రవాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుండి టీఆర్‌ఎస్‌కు వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో దుబ్బాక నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజిబింకర్ బాలరాజు,ఆకుల నరేందర్,బాల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీ నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గులాబి తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి హరీష్ రావు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్ఎస్‌లో నరసింహారెడ్డి, మనోహర్ రావు, బంగారయ్య లాంటి సీనియర్ నాయకులు టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నారంటే కారణం వారికి టీఆర్ఎస్ పట్ల ఉన్న నమ్మకమేనన్నారు. పార్టీలో చేరి దుబ్బాక ప్రజలకు న్యాయం చేస్తామని వారు అంటున్నారు. రోజురోజుకు ఎన్నికలు సమీపించిన కొద్ది టీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ రోజు నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి యువకులు చాలా మంది పార్టీ వైపు వస్తున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి చరిత్రలో నిలిచి పోతుందన్నారు. దుబ్బాకలో మరోసారి టీఆర్‌ఎస్ విజయ కేతనం ఎగుర వేస్తుందని మంత్రి హరీష్ పేర్కొన్నారు.