మొక్కలు నాటిన సినీ నటుడు గౌతమ్ రాజు…

143
Actor Gowtham Raju

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా సినీ నటుడు గౌతమ్ రాజు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని కలిగించిందని సినీ నటుడు గౌతమ్ రాజు అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని ఉద్దేశ్యంతో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎం.పి సంతోష్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.చెట్లు కార్బన్ డైయాక్షయిడ్ పీల్చుకుని మనకు అక్షిజన్ ఇచ్చి మన ఆయుషును పెంచుతున్న చెట్లను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నదుకు సంతోషంగా ఉందని తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను దేశ వ్యాప్తంగా విస్తరింపజేసిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ నటుడు అశోక్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి అత్తాపూర్ లోని తన నివాసంలో కుమారుడు హీరో క్రిష్ణ తో కలిసి సినీ నటుడు గౌతమ్ రాజు నాటిన మొక్కలు…అనంతరం మరో నలుగురు ( సినీ నటీమణులు అన్నపూర్ణమ్మ , శ్రీ లక్మి , ఢిల్లీ రాజేశ్వరి , సనా ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.