రాష్ట్రాభివృద్ధికి నయాపైసా తెచ్చారా: జీవన్ రెడ్డి

42
jeevan reddy

రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నయాపైసా తెచ్చారా ? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి…కాషాయం పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్నారు. గాడ్సే వారసులే ఆ పార్టీలో కొనసాగుతున్నారని మండిపడ్డారు.

ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా అని దుయ్యబట్టారు. కేంద్ర అగ్ర పదవుల్లో బీజేపీ గుజరాత్ వాళ్లను నింపేసింది. వరద బాధితులకు రూ. 25 వేలు సాయం చేస్తామని ముఖం చాటేసిందన్నారు. కేంద్ర సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించిన జీవన్ రెడ్డి…బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు తెలంగాణకు వచ్చి అభివృద్ధి చూడాలని సూచించారు.

బీజేపీ నేత తరుణ్ ఛుగ్ పంజాబ్ రైతులను అర్బన్ నక్సల్స్ తో పోల్చారని తెలిపారు ఎమ్మెల్సీ భాను ప్రసాద్. అలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.