నేను బాగానే ఉన్నాను: ఎమ్మెల్యే బిగాల గణేష్

209
mla ganesh
- Advertisement -

తెలంగాణలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఇందులో ఇటీవల టీఆర్‌ఎస్‌ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చికిత్స పోందుతున్నారు. ఈ నేపథ్యంలో నేను బాగానే ఉన్నాను ఎవరు అధైర్యపడవద్దు అని ఎమ్మెల్యే అన్నారు. భగవంతుని కృపతో, ప్రజల ఆశిస్సులతో త్వరలో నేను చేయించుకోబోయే టెస్ట్‌లో నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నాను.

నాపై చూపే మీ ప్రేమకు ప్రజలందరికి,అభిమానులకు శ్రేయోభిలాషులకు కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను. అందరూ తప్పకుండా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ ను పాటించండి.. ఇంట్లోనే ఉండండి అని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కోరారు. అయితే ఇదివరకే కరోనా బారిన పడిన నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్దారించారు.

- Advertisement -