కేంద్రం తీరుపై టిఆర్ఎస్ నిరసనలు..

98
- Advertisement -

ఇప్పటి పంటనే కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటలు పండించమనడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉప్పల్‌లో డివిజన్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్. కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తెలంగాణాలో పండిన ప్రతి వరి గింజను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -