ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్‌ సభ్యత్వాలు

124
TRS Membership World wide

ఎట్లస్తదో తెలంగాణ అన్న నోర్లతోనే తెలంగాణ ఎట్ల రాదు అని అనిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె.చంద్రశెఖర్ రావు ఇచ్చిన పార్టి సభ్యత్వాల నమోదు పిలుపు మేరకు విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణ వాదులు కూడ ఉత్సహంగా పాల్గొన్నారు.

అమెరికాలో జరిగిన సభ్యత్వ నమోదు ప్రక్రియ లో సియటెల్ నుండి జలగం సుధీర్ కుమార్, కొలంబస్ నుండి  నవీన్ కానుగంటి, అట్లంటా నుండి శివ రామడుగు  సభ్యత్వం తీసుకున్నారు. ఇదే విదంగా డల్లాస్, బే ఏరియా, న్యు జెర్సి, చార్లెట్,  లాస్ ఎంజిల్స్, చికాగో లాంటి అనేక ప్రముఖ నగరల నుండి ప్రవాస తెలంగాణ వాదులు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొని టీఆన్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.

60 ఎండ్ల గోస నుండి బయటపడ్డ తెలంగాణ అభివ్రుద్ది కి ప్రవాస భారతీయులు చేయుత అందించటం అభినందనీయం అని టి.ఆర్.ఎస్ నాయకులు తెలిపారు. విదేశాల్లో ఉన్న వ్యవసాయ, ఆరొగ్య, విద్యా వ్యవస్త లపై కొంత రిసెర్చ్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు నివేదిక రూపం లో అందిస్తామని జలగం సుధీర్, శివ రామాడుగు, నవీన్ కానుగంటి, అనిల్ కూర్మాచలం, సతిష్ తెలిపారు.

ఇంటింటికి నల్ల నీల్లు, మిషన్ కాకతీయ, కల్యాన్ లక్ష్మి, ఆసరా పెన్షన్స్ లాంటి అనెక పథకాలకు రూప కల్పన చేసిన టి.ఆర్.ఎస్ అధినేత  కె.సి.ఆర్. కు ప్రత్యెక క్రుతజ్ఞతలు తెలిపారు. లండన్ నుండి అనిల్ కూర్మచలం, ఆస్ట్రేలియ నుండి అనిల్ బై రెడ్డి, బహెరెన్ నుండీ సతిష్..ఇలా ప్రపంచం నలు మూలల నుండి టి.ఆర్.ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.