నేను బుర్రలేని వాడిని..

197
Keeravani on his comments
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు ట్విట్టర్ లో కీరవాణి ప్రస్తుత సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై ఆసక్తిగా స్పందించిన సంగతి తెలిసిందే. తెలుగులో బుర్రతక్కువ దర్శకులు పెరిగిపోయారు… ఇక గీత రచయిత విషయానికి వస్తే వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి రచయితలు ఘాటూగా స్పందించిన సంగతి తెలిసిందే.

దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సలహా మేరకు అప్పుడు చేసిన ట్వీట్లను డిలీట్‌ చేసినట్టు తెలిపిన ఆయన.. మరికొన్ని ట్వీట్లు చేశారు. నేను చేసిన ట్వీట్లు చాలామందిని బాధించాయి …తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దల సూచన మేరకు వాటిని డిలీట్‌ చేశానని తెలిపారు. మేమందరం ఎప్పటికీ విద్యార్థులమేనని … తప్పులు చేస్తుంటామని … తమ్మారెడ్డి భరద్వాజలాంటి వారు మమ్మల్ని సరిదిద్దుతుంటారని తెలిపారు.

ఐదు నిమిషాల పాటు బుర్రలేని నా బుర్రను తమ్మారెడ్డి భరద్వాజ వాష్‌ చేశారు.(కీరవాణిపై ఓ వీడియోను తయారు చేసి ఆన్‌లైన్‌ పెట్టారు తమ్మారెడ్డి భరద్వాజ) . ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.మరోసారి తమ్మారెడ్డి భరద్వాజ, త్యాగయ్యగారికి ధన్యవాదాలు అంటూ ట్విట్ల వర్షం కురిపించారు. నేను వృద్ధుడిని అయిపోయానని ఎలా మర్చిపోయానో? గీత ర‌చ‌యిత‌లంద‌రూ నాకు ఇష్టమే. అన్ని పాటలు వారు కష్టపడి రాశారని తెలిపారు.

దర్శకులు గొప్పవారు, వినయ విధేతలు కలిగిన వారని కానీ నేను ఎప్పటికీ బుర్రలేని వాడినేని తెలిపారు. అందరూ సృజనశీలురు, ఒద్దికగా ఉండేవాళ్లు… నేను తప్ప అని ట్విట్ చేశారు.  ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవాళ్లు. వాళ్లతో పనిచేసేందుకు నేను పడి చస్తా. అయితే అందరికన్నా చివరిలో స్థానంలో ఉండే నేనో వయసు మళ్లిన, బుర్రలేని కంపోజర్‌ని అంటూ వరుస ట్విట్లు చేశారు.

ఇంకా కిరవాణి చేసిన ట్వీట్లు..

() నా వరకూ వేటూరి గారు 100, సిరివెన్నెల సీతారామశాస్త్రి 90, నా తండ్రి 35, నేను 10, మిగిలిన వారందరూ 11 నుంచి 89 మధ్య స్థాయి కలవారు.
() ఇటీవల సాయిగారు ఓ టెలివిజన్‌ కార్యక్రమం చూశారు. టాలీవుడ్‌లో కంపోజర్ల కొరత ఉందని ఆయన అన్నారు. ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవించలేదు.
() అసలు కొరత రచయితలకు ఉంది. అతి తక్కువ చెల్లించేది వారికే.
() రచన నుంచి వైదొలగాలని అనంత శ్రీరామ్‌ కోరుకునేవారు. ఎందుకంటే నిజమైన రచయితలకు అవకాశాలు ఉండటం లేదని.
() తెలుగు సినీ సాహిత్యం అంపశయ్య మీద లేదు. ప్రస్తుతం అనంత్‌ ఇబ్బందుల్లో ఉన్నారు.
() దేశ భక్తి, నీతివాక్యాలు కలిగిన పాటల కోసమే దర్శకులు తమను సంప్రదిస్తున్నారని.. యుగళగీతం, ఐటమ్‌ సాంగ్‌లు హీరో, డైరెక్టర్‌, సింగర్‌ తదితరులు రచిస్తున్నారని అనంత్‌ శ్రీరామ్‌ అంటున్నారు.
() నేను చిత్ర పరిశ్రమలో ఏమీ కానప్పుడే చాలా సీనియర్‌ అయిన శివదత్త గారు అమాయక చక్రవర్తి(విజయ బాపినీడు)కి రాశారు.
() చంద్రబోస్‌గారు నా మేనల్లుడు. బంధుప్రీతికే నా ఓటు. ఆ కారణంగా నా సినిమాలకు ఆయన ఎన్నో పాటలు రాశారు.
() పని చేయమంటూ రాజమౌళి నాపై కోపడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఏప్రిల్‌ 28న సినిమా విడుదల చేయాలని అనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా! అంటూ ముగించాడు.

- Advertisement -