ఇటీవల టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై తెరాస యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల ఓ ప్రకటనలో తెలిపారు.
కేసీఆర్ విడుదల చేసిన ప్రజామ్యానిఫెస్టో ఆచరణాత్మకంగా,విశ్వసనీయంగా ఉందని,కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారని, 2014 ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ వందశాతం పూర్తిచేసిన ఘనత కేసీఆర్ సర్కార్ ది మాత్రమే అని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో నేడు దేశానికే ఆదర్శమని, ఇది కేవలం రాబోయే ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్‌తరాలకు ఉపయోగపడేలా ఉందని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎందరో జీవితాలకి భరోసాగా నిలిచిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు, కేసీఆర్ ప్రకటించిన మానిఫెస్టోను చూసి ప్రజలు కనీసం డిపాజిట్లు కూడా దక్కించేలా లేరని తెలుసుకొని, మేనిఫెస్టోను కాపీ కొట్టిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారు కనీసం ఇప్పటివరకు ఒక అభ్యర్థిని కూడా ప్రటకరించుకోలేని స్థితిలో ఉండి, మానిఫెస్టో గురించి విమర్శించడం వారి అమాయకత్వమని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు తగిన బుద్ది చెప్పి, టీఆర్ఎస్ పార్టీని వంద సీట్లకు పైగా గెలిపించి కేసీఆర్‌ని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయడం తధ్యమని తెలిపారు. ఎన్నారై తెరాస యూకే బృందం త్వరలో తెలంగాణ అంతటా పర్యటించి విసృత ప్రచారం చేసి, పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.