బర్త్ డే…మొక్కలు నాటిన మందుల సామేల్

30
samuel

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నాంపల్లి లోని తన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఉద్యమ కాలం నుండి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండి తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అన్నారు.

ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని..ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న మేధావులు,సినీ రంగ ప్రముఖులు ,అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు. మా గిడ్డంగుల సంస్థలో ఉన్న అధికారులు, ఉద్యోగులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు…నాకు ఈ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.