ముగిసిన టీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీ..

252
TRS MLA
- Advertisement -

తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులతో పాటు..టీఆర్‌ఎస్‌ శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలకు  సభ్యలంతా విధిగా హాజరుకావాలని సూచించారు. సభా సమయం వృధాకాకుండా వ్యవహరించాలన్నారు. అధికార పార్టీ సభ్యులంతా హుందాగా వ్యవహరించాలనీ, అవసరమైతే సమావేశాల పొడిగింపుపై కూడా తమకు ఎలాంటి అభ్యంతరంలేదన్నారు. సంక్షమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. సభలో ఎవరూ నోరు జారొద్దని, విపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని చెప్పారు. మంత్రులు పూర్తి తమ శాఖలను సంబంధించిన పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా సభకు హాజరుకావాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు చర్చలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు చెప్పుకోవాలని అన్నారు.

 సమావేశాల్లో విపక్షాలు ఏ డిమాండ్లు చేస్తాయి, ఏ ప్రశ్నలు సంధిస్తాయన్న అంశాలపై దృష్టి పెట్ట్టాలని కేసీఆర్ సభ్యులకు సూచించారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు పూర్తీ వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఆయా శాఖల వారీగా పూర్తి వివరాలను సభ ముందుంచాలన్నారు.

TRS MLA

ఈసారి ప్రధానంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశాలపై సీఎం సభ్యులకు తగిన వివరణ ఇచ్చారు. అలాగే రెండున్నరేళ్ల స్వల్ప సమయంలో రాష్ట్ర అభివృద్ధి..సంక్షేమం కోసం ఏం చేశామో ప్రజలకు తెలిజేయాలన్నారు. వీటితో పాటు నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలను నుంచి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో..వాటిని సమర్ధంగావంతగా ఎదుర్కోవాలని చూచించారు. నోట్ల రద్దు సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను..ప్రజలకు తెలియజేయాలన్నారు. నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల దృష్టికి తీసుకురావాలన్నారు.

టీఆర్ఎస్ ఎల్పీ భేటీకి ముందు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ మీటింగ్ లో పాల్గొన్నారు. డిసెంబర్ 16 ప్రారంభం కానున్న పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేసంలో సీఎం కేసీఆర్ తో పాటు అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు మీటింగ్ కు హాజరయ్యారు.

డిసెంబర్ 30 వరకు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 12 పనిదినాల్లో 9 అంశాలపై సమగ్రంగా చర్చించాలని డిసైడయ్యారు. ఈ నెల 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీ, మండలికి సెలవు. అవసరమైతే సమావేశాలను పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే క్వశ్చన్ అవర్ ను గంటన్నరకు పొడిగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎలాంటి హడావుడికి తావు లేకుండా ఎంత సేపైనా, ఎన్ని రోజులైనా చర్చించేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో విపక్షాల అభ్యంతరాలకు గట్టి సమాధానమిచ్చేందుకు కూడా ప్రభుత్వం సమాయత్తమైంది. అన్ని అంశాలపై విపక్షాలకు దీటుగా సమాధానమిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అటు శాసన మండలి సమావేశాలు కూడా యథాతథంగా జరుగుతాయి. మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పక్షాలకు చెందిన మండలి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -