రన్‌బీర్‌తో అందుకే విడిపోయా..కత్రీనా

137
katrina-kaif

బాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ లవ్ కపుల్స్‌ ముద్ర వేసుకున్న జంట రన్‌బీర్ కపూర్‌,,కత్రీనా కైఫ్‌. మూడు సంవత్సరాలపాటు రన్‌బీర్‌, క్యాట్‌ మధ్య ప్రేమాయణం ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే. విదేశీ బీచుల్లో కూడా అప్పట్లో వీరే కనబడ్డారు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అంటూ ఏకంగా ఓ ప్లాట్‌ లో సంసారం కూడా పెట్టారు. ఒక ఏడాదిపాట సహాజీవనం చేసిన ఈ జంట సడేన్‌గా బ్రేకప్ అంటూ పెద్ద బాంబు పేల్చారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ, విడిపోయారు. అప్పటి నుంచి ఇక వారిద్దరూ కలసి కనపడింది కూడా లేదు. అయితే, రణబీర్ తో తాను ఎందుకు విడిపోయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది క్యాట్.

Katrina-kaif-Movi

అబద్ధాలు ఆడడంలో రణబీర్ ను మించిన వాడు లేడని ఈ సందర్భంగా కత్రిన మండిపడింది. కుటుంబానికే అతను ఎక్కువ విలువ ఇస్తాడని..వారి తర్వాతే మరెవరైనా అని.. ఇలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడుతుందని ప్రశ్నించింది. రణబీర్ ను మరోసారి నమ్మడం అంటూ ఉండదని… ఇకపై తాము కలవమని చెప్పింది. అతడిని వేరే ఏ అమ్మాయి కూడా ఇష్టపడదని… ప్రేమాదోమా అంటూ ఏ అమ్మాయి వెంట పడకుండా, ఇంట్లోవారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతనికి మంచిదని ఓ రకంగా వార్నింగే ఇచ్చింది. అయితే ఇన్నిరోజులు సస్పెన్స్ గా ఉన్న వీరి బ్రేకప్ సీక్రెట్ ను క్యాట్ గుండబద్ధలు కొట్టింది. అభిప్రాయంపై కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. రన్బీర్ మళ్లీ మాజీ లవర్ దీపికాకు దగ్గరవుతున్నాడని..రన్‌బీర్ పై ఉన్న అనుమానంతోనే క్యాట్‌ అతన్ని దూరం పెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఇంకొందరేమో..క్యాట్ ఇటు సల్మాన్‌కు దగ్గైరైయ్యేందుకే రన్‌బీర్‌ను దూరం పెడుతుందని వార్తలు వస్తున్నాయి.

katrina-kaif

ఏదేమైనా..పెళ్లి తో ఒక్కటి అవుతారనుకున్న ఈ లవ్‌ కపుల్స్ మనస్పర్ధాల వల్ల విడిపోవడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యంగా ఇద్దరి ఫ్యాన్స్ కొంత నిరాశకు గురైయ్యారని చెప్పోచ్చు. బాలీవుడ్‌ లో ప్రేమలు…బ్రేకప్ అనేవి సర్వసాధారణం…ఇప్పటికే వరకు ఎంతో మంది తారలు ప్రేమ..పెళ్లి అంటూ చాలా మందే విడిపోయారు. విడిపోయిన ప్రేమికులుగా రన్‌బీర్ కత్రినా కూడా నిలిచిపోయారు. ఒకవేళ ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమపుట్టి దగ్గరైనా ఆశ్చర్యపోనవసం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ప్రేమలను అంచనా వేయడం ఎవరితరం కాదు…