మహేష్ మెచ్చిన ‘జాను’

119
mahesh

మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘ఓకే బంగారం’ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘ఓకే జాను’గా రీమేక్‌ చేస్తున్నారు. షాద్‌ ఆలీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో నాయకానాయికలుగా ఆదిత్యరాయ్ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ఆషిఖి2’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. 2013లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఓకే జాను’. సహజీనవం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ok jaanu

‘ఓకే జాను’ చిత్రం ట్రైలర్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకి నచ్చిందట. ఈ విషయాన్ని మహేశ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘ఓకే జాను’ చిత్రం ట్రైలర్‌ను చూశానని.. పూర్తిగా కనువిందు కల్గించేలా ఉందన్నారు. రవి కె. చంద్రన్‌ పనితనం అద్భుతంగా ఉందంటూ ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ok jaanu

దీనికి కొరియోగ్రాఫర్‌ రవి కె. చంద్రన్‌ స్పందిస్తూ.. మహేశ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ నెల 11న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ను ఇప్పటి వరకు 90 లక్షల మందికి పైగా చూశారు. 86,083 మంది లైక్‌ చేశారు. సంక్రాంతి కానుకగా ఓకే జాను విడుదల కానుంది.

OK Jaanu | Official Trailer | Aditya Roy Kapur, Shraddha Kapoor | A.R. Rahman