తుది దశకు‌ ఓట్ల లెక్కింపు.. కారు జోరు..

103
GHMC polls

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్పష్టత దిశగా గ్రేటర్ తీర్పు వస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. తుది ఫ‌లితాల కోసం న‌గ‌ర ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 108 స్థానాల‌లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.

టీఆర్ఎస్ -42 స్థానాల‌లో ఎంఐఎం-35, బీజేపీ -25 స్థానాల‌లో విజ‌యం సాధించాయి. ఇక కాంగ్రెస్ రెండు చోట్ల గెలుపొందింది. మ‌రో 41 డివిజ‌న్‌ల‌లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. వీటిలో టీఆర్ఎస్ ‌29 స్థానాల‌లో, బీజేపీ 11 స్థానాలలో, కాంగ్రెస్ ఒకచోట ఆధిక్యంలో ఉన్నాయి.