- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్పష్టత దిశగా గ్రేటర్ తీర్పు వస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. తుది ఫలితాల కోసం నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సాయంత్రం 5 గంటల వరకు 108 స్థానాలలో ఫలితాలు వెలువడ్డాయి.
టీఆర్ఎస్ -42 స్థానాలలో ఎంఐఎం-35, బీజేపీ -25 స్థానాలలో విజయం సాధించాయి. ఇక కాంగ్రెస్ రెండు చోట్ల గెలుపొందింది. మరో 41 డివిజన్‌లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిలో టీఆర్ఎస్ 29 స్థానాలలో, బీజేపీ 11 స్థానాలలో, కాంగ్రెస్ ఒకచోట ఆధిక్యంలో ఉన్నాయి.
- Advertisement -