12వ రౌండ్.. 23,821 ఆధిక్యంలో టీఆర్ఎస్

454
saidireddy
- Advertisement -

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. పోలింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి ప్రతి రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోన్న టీఆర్ఎస్ 12వ రౌండ్ పూర్తయ్యే సరికి
23,821 ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ గెలుపుతో గులాబీ నేతల సంబరాలు మిన్నంటాయి. హుజుర్‌నగర్, మెల్లచేరువు, మట్టంపల్లి,నెరేడుచర్ల, గరేడేపల్లి, పాలకీడు, చింతలపాలెం మండలాల్లో గ్రామాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కట్టంగూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భారీ ర్యాలీ నిర్వహించారు.

ఉదయం 8 గంటలకు సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లోనే లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు. లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. తుది ఫలితం మధ్యాహ్నం 12.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -