హుజుర్ నగర్ గెలుపు తెలంగాణ విజయంః మంత్రి ఎర్రబెల్లి

520
errabelli dayakar rao

హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ విజయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో హన్మకొండ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాల్లో పాల్గోన్నారు మంత్రి ఎర్రబెల్లి. అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ పాల్గోన్నారు. ఈ విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టు వంటిది అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తే ప్రజలు సహించరన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా మారకపోతే ప్రజలు తరిమికొడతారన్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. హుజుర్ నగర్ లో 15 ఏండ్లుగా ఉత్తమ్ గెలిచిన ఆ నియోజకవర్గ నికి చేసింది ఏమి లేదన్నారు.

హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఒక్క రౌండ్ లో కూడా కాంగ్రెస్ లీడ్ ఇవ్వలేక పోయింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. హుజుర్ నగర్ నియోజకవర్గంలోని , మెల్లచేరువు, మట్టంపల్లి,నెరేడుచర్ల, గరేడేపల్లి, పాలకీడు, చింతలపాలెం మండలాల్లో గ్రామాల్లో trs కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. టీఆరెస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి భారీ విజయాన్ని పురస్కరించుకుని కట్టంగూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.