బీజేపీ,టీడీపీ డిపాజిట్‌ గల్లంతు…

326
huzurnagar by polls

హుజుర్‌ నగర్ ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ సునామీకి కాంగ్రెస్ బేజారు కాగా బీజేపీ,టీడీపీ డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. 12వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 23,821 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్‌కు టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూనే ఉంది.

తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు మరోసారి విశ్వాసం చూపించారని చెప్పారు.

పోలింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి ప్రతి రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది టీఆర్ఎస్. సైదిరెడ్డి గెలుపుతో గులాబీ నేతల సంబరాలు మిన్నంటాయి. హుజుర్‌నగర్, మెల్లచేరువు, మట్టంపల్లి,నెరేడుచర్ల, గరేడేపల్లి, పాలకీడు, చింతలపాలెం మండలాల్లో గ్రామాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కట్టంగూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భారీ ర్యాలీ నిర్వహించారు.