ప్రజాక్షేత్రంలోనే ఉంటా:మాజీ ఎంపీ వినోద్

501
vinod kumar trs
- Advertisement -

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్‌ అని…ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ ..తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. సార్వత్రిక ఎన్నికల్లో జాతీయవాదమే బలంగా వినిపించిందని మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిలో ఎక్కువశాం మంది బీజేపీకే ఓటేశారని చెప్పారు.

ఎన్నికలకు ముందు తీవ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడి బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు చాలా ముఖ్యమని చెప్పిన వినోద్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుపడ్డానని చెప్పారు వినోద్. కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు సాధించడానికి కృషి చేశానని చెప్పారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చానని ఫలితంగా ఐదేళ్లలో వెయ్యికోట్లు రానున్నాయని చెప్పారు.

- Advertisement -