సీఎం కేసీఆర్ బాటలో జగన్‌..ఏపీ కొత్త జిల్లాలు ఇవే..!

432
jagan ap new districts

పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేశారు సీఎం కేసీఆర్. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాల తెలంగాణగా పల్లెల్లో వెలుగులు నింపుతున్నారు కేసీఆర్. సీఎం ముందుచూపుతో పాలన ప్రజలకు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బాటలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ సీఎం జగన్‌.

పాలనలో సంస్కరణలో భాగంగా ఇప్పటికే తన పేషిలోనూ అధికారులను బదిలీ చేసిన జగన్‌ త్వరలోనే ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయనున్నారు. పాదయాత్రలో,ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలులో భాగంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు కొత్తగా 12 కలిపి 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మార్చనున్నారు. వీటిలో ఒక గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉందని టాక్‌.

కొత్తగా ఏర్పడే జిల్లాలు ఇవేనంటూ వైసీపీ నేతలు లీకులు ఇస్తున్నారు. అరకు,అనకాపల్లి,అమలాపురం,రాజమండ్రి,నరసాపురం,విజయవాడ,నర్సరావుపేట,బాపట్ల,నంద్యాల, హిందూపురం, తిరుపతి, రాజంపేటలు కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.