పారదర్శకంగా భూపట్టాల పంపిణీ: హరీశ్ రావు

304
harish rao
- Advertisement -

రైతుల భూమి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ భూ ప్రక్షాళన చేపట్టారని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా రెడ్డి ఫంక్షన్ హాల్ లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన హరీష్ దేశంలొనే మరెక్కడా ఇంత పారదర్శకంగా భూ పట్టాల పంపిణీ జరగడం లేదన్నారు.

పట్టాలు తీసుకున్న ప్రతి రైతుకు రైతు బంధు చెక్కులను అందజేస్తామని చెప్పారు. రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలని సూచించిన హరీశ్…సేంద్రీయ ఎరువులు,పచ్చి రొట్టె విత్తనాలను ఎక్కువగా వాడి అధిక దిగుబడిని సాధించాలన్నారు.

రైతులకు 100 శాతంసబ్సిడీ పై క్యాటిల్ షెడ్ లు నిర్మింప జేస్తున్నామని..దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సామూహిక గొర్రెల షెడ్లు ప్రభుత్వం తరపున నిర్మింప జేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 59,640 మందికి పట్టాపాస్ బుక్‌లు అందజేశామని 94 శాతం పూర్తయ్యిందన్నారు. ఈ సందర్భంగా 773 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

- Advertisement -