కరోనా లాక్ డౌన్ కర్వ్యూ ఎఫెక్ట్ జీవనోపాధి వృత్తిలో ఉండే అందరి తోపాటు పురోహితుల (పూజారుల..పంతుల) పైనా పడింది..అలాంటి పేద పూజరులు తినడానికి కూడా సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని టిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సికింద్రాబాద్ పలు ఆలయాలల్లో పూజలు చేసి జీవనోపాధి పొందే పూజారుల ఇండ్ల వద్దకు వెళ్లి నిత్యావుసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కట్టెల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నువ్వు పారిపో అనే విధంగా పూజలు..హోమాలు..చేసే పురోహితులు..నిత్యం పలు ఆలయాల తోపాటు ఇతర కార్యక్రమాలల్లో పూజలు చేస్తూ జీవన సాగించే పూజారులు ఆపద సమయం ఎవరిని యాచించ కుండా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి పూజారులు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావడంతో వెంటనే అలాంటి వారికి నెలకు సరిపడా బియ్యం.చక్కెర.. పప్పు..నూనె..ఉల్లిగడ్డలు..చింతపండు తోపాటు ఇతర నిత్యావుసర సరుకులు అందించినట్లు తెలిపారు.
తమ పరిధిలో నివసించే పురోహితులు ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా అందజేస్తామని స్పష్టం చేశారు కట్టెల..అదే విధంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రోజుకో కొత్త కార్యక్రమం నిర్వహిస్తూ పేద ప్రజలను తమకు తోచిన విధంగా అదుకుంటునట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు లాక్ డౌన్ నుండి సపాయాన్న నీకు సలాం అంటూ మున్సిపల్ కార్మికులకు ప్రోటీన్స్ తో కూడిన కోడి మాంసం.. కోడి గుడ్లు అందించారు. తలసిమియా వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం కిమ్స్ ఆస్పత్రికి వంద మంది ప్రెండ్స్ తో రక్తదానం చేశారు. నిత్యావుసర వస్తువులు లేక తినేందుకు ఇబ్బందులు పడుతున్న పేద వారికి ప్రతి రోజు ఎదో ఓ ఏరియాలో సరుకులు పంపిణీ చేస్తూన్నట్లు తెలిపారు.