దేశ వ్యాప్తంగా లోక్ సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయంతో పాటు, డబ్బును ఆదాచేయవచ్చని కేంద్ర సర్కాల్ ఆలోచన. దీనిపై దేశంలోని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియ చేయాలని లా కమిషన్ ఇటీవలె ఓ ప్రకటన చేసింది.
ఈ విషయంపై పలు పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, లా కమిషన్ కు లేఖ రాశారు. జమిలీ ఎన్నికలు 2019లో నిర్వహిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశే అధికార పార్టీ టీడీపీ తెలిపింది. ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ నెల 10న తమ పార్టీ అభిప్రాయాన్ని తెలిజేస్తామంది.
అన్నాడీఎంకే, అకాలిదళ్ పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించగా, సీపీఐ, టీఎంసీ, గోవా పార్వర్డ్ పార్టీ, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి. విపక్షాలతో చర్చించిన తర్వాత ఈ విషయంపై క్లారీటీ ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈనెల చివరిలోపు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని మరో జాతీయ పార్టీ బీజేపీ తెలిపింది.