టీఆర్‌ఎస్ గొల్ల,కురుమల వెన్నెముక అని స్పష్టం చేశారు ఎంపీ కవిత.బోధన్‌లో కురుమ,యాదువల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ఎంపీ కవిత కాంగ్రెస్,టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. ముఖ్యంగా గొల్ల,కురుమల సంక్షేమానికి ఈ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు. దేశంలో గొల్ల కురుమల సంక్షేమానికి 6 వేల 800 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.
సమాజంలోని అన్నివర్గాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి ఎకరానికి 8 వేలు అందిస్తున్నామని రానున్న రోజుల్లో 10 వేలు అందిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ మన ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను అడ్డుకుంటారని చెప్పారు. మహాకూటమికి ఓటుతో బుద్దిచెప్పాలన్నారు.
గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగేళ్లలో గల్ఫ్ బాధితుల కోసం 106 కోట్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ నేతల దుబాయ్ పర్యటన చూస్తే నవ్వొస్తుందన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. వికలాంగుల పెన్షన్లను 1500 నుంచి 3 వేలకు పెంచుతామన్నారు. ప్రతీ గ్రామంలో అర్హత ఉన్నవారికి పెన్షన్ అందిస్తామని చెప్పారు. బోధన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కవిత.