నా జీవితంలో కొత్త మలుపు ‘శరభ’..

203
Sharabha Movie Press Meet
- Advertisement -

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం “శరభ”. ఎన్‌.నరసింహరావు దర్శకత్వం వహించగా ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించారు. న‌వంబ‌ర్ 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆర్‌.నారాయణమూర్తి మేకింగ్‌ వీడియోను విడుదల చేయగా, ట్రైలర్‌ను జయప్రద, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. “తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీనే నన్ను ఇంతదాన్ని చేసింది. ఎప్పటికీ ఈ రుణాన్ని తీర్చుకోలేను. మళ్లీ జయప్రదగా తెలుగు బిడ్డగానే నన్ను పుట్టించాలని దేవుడుని కోరుకుంటున్నాను. అశ్వని కుమార్‌ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. పెద్ద బిజినెస్‌మేన్‌ అయిన ఆయన దుబాయ్‌లో మహారాజులా ఉండొచ్చు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోను పరిచయం చేయాలనే ఒక ధైర్యంతో తన కొడుకు ఆకాశ్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు. పాటలు, ఫైట్స్‌ లాంటివి తెలియని సున్నితమైన ఆకాశ్‌తో “శరభ” లాంటి భారీ చిత్రం రూపొందించిన మా దర్శకుడు నరసింహకి నా హ్యాట్సప్‌.

Sharabha Movie Press Meet

ఇక హీరోయిన్‌ మిస్టీ చక్రవర్తి… బెంగాలీలో మిస్టీ దహీ అంటే స్వీట్‌ కర్డ్‌. ఈ మిస్టీ కూడా ఎంతో స్వీట్‌. ఆమె నవ్విందంటే అందరూ అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు. భారీ గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమాలో తల్లి కొడుకు అనే ఎమోషన్‌ను ఇమడ్చటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. మీరు బాహుబలి చూసుంటారు. అరుందతి చూసుంటారు. శరభ లాంటి సినిమాలు రావడానికి కూడా ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. ఇలాంటి చిత్రాలను ధైర్యం చేసి నిర్మించడం నరసింహా వంటి దర్శకుడికి మొదటి ఛాన్స్ ఇవ్వడం అనేది నిర్మాత గొప్పతనం. ప్రజలు దీన్ని ఆదరిస్తారనే గొప్ప ధైర్యం నాకుంది.

చదలవాడ శ్రీనివాసరావు స్నేహానికి ప్రతీక. పాతికేళ్లుగా ఆయనతో పరిచయం. ఫోన్‌ చేయగానే ఆయన ఈ సినిమాను రిలీజ్‌ వరకూ తీసుకొచ్చారు. నేను పెద్ద హీరోయిన్‌ను అనే భావనతో అంతా మాట్లాడారు ధన్యవాదాలు. కానీ ప్రతీ సినిమా నా జీవితంలో ఒక పరీక్ష. పాలిటిక్స్‌ నుంచి సినిమాల్లోకి రీఎంట్రి ఇద్దామనుకున్నప్పుడు ఇండస్ట్రీలో పాత పరిస్థితులు లేవు. ఇప్పుడు అంతా కొత్తవారే. అందుకే నేనూ ఓ కొత్తమ్మాయి తరహాలో ఇంట్రడ్యూస్‌ అవుతున్నాను. నా జీవితంలో కొత్త మలుపు శరభతో స్టార్ట్ అవుతోంది కాబట్టి నన్ను ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరుతున్నాను’ అన్నారు.

- Advertisement -