‘వినయ విధేయ రామ’ ఆడియో వేదిక ఖ‌రారు..

245
ram charan new movie
- Advertisement -

మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనివాస్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న మూవీ వినయ విధేయ రామ. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే టాకీ పార్టును పూర్తి చేసుకున్న‌ట్లు సమాచారం. పాట‌ల చిత్రిక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉందని తెలుస్తుంది. డివివి దాన‌య్య ఈసినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుక‌గా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

ram charan new movie

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈసినిమా ఆడియో వేడుక‌ను చాలా గ్రాండ్ నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 4వ వారంలో పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం. వైజాగ్ వేదిక‌గా ఆడియో ఫంక్ష‌న్ ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు చిత్ర‌యూనిట్.

గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్ధ‌లం సినిమా ఆడియో లాంచ్ ప్రొగ్రాంను కూడా వైజాగ్ లో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దింతో రంగ‌స్ధ‌లం సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. అదే సెంటిమెంట్ తో ‘వినయ విధేయ రామ’ ఆడియోను అక్కడే నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని సమాచారం. త్వ‌ర‌లోనే డేట్ ను కూడా అనౌన్స్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 11న సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.

- Advertisement -