సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను ఆదుకుంటాంః మంత్రి కేటీఆర్

282
ktr
- Advertisement -

సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను అన్నివిధాలా ఆదుకుంటామ‌న్నారు మంత్రి కేటీఆర్. ఈసంద‌ర్భంగా సిరిసిల్ల కాట‌న్ వ‌స్ర్త ప‌రిశ్ర‌మ ఉత్ప‌త్తిదారుల ఆత్మీయ సమ్మేళ‌నంలో మంత్రి పాల్లోన్నారు. సిరిసిల్ల వస్ర్తాలకు దేశవ్యాప్తంగా పేరు రావాల‌న్నారు. తిరుపూర్ అసోసిషయేష‌న్ కు ఉన్న పేరు ప్ర‌ఖ్యాత‌లు సిరిసిల్ల ప‌రిశ్ర‌మ‌కు రావాల‌ని చెప్పారు. గుజరాత్ కాటన్ కంటే తెలంగాణ కాటన్ బాగుందని ఇప్పటికే కొంత మంది నిపుణులు చెప్పారన్నారు.కార్మికులు ఎదిగేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామ‌న్నారు.

ktr1

కొంత‌ మంది నేతలకు పవర్‌లూమ్, చేనేత అంటే ఏమిటో కూడా తెలియదు అని ఆయన ఎద్దెవా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేను అయ్యాను. ప్రజల ఆదాయం పెరగాలనేది టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యం. పెరిగిన ప్రభుత్వ ఆదాయం ప్రజలకు పునఃపంపిణీ జరగాలనేది కేసీఆర్ ప్రధాన ఆశయం. టీఆర్ఎస్ మాటల ప్ర‌భుత్వం కాదు చేతల ప్ర‌భుత్వం అని నిరూపించామ‌న్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమ కార్మికులకు 8 నెలల పని లభిస్తోంది. కార్మికులు సంఘటితమైతే అనుకున్నది సాధించవ‌చ్చ‌ని తెలిపారు.

- Advertisement -