గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను గుర్తులో పెట్టుకుని ముందుగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది టీఆర్ఎస్. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తుతో జరిగిన నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన టీఆర్ఎస్…మునుగోడు ఎన్నికల్లో అలాంటి నష్టం జరగకూడదని ఈసీని ఆశ్రయించింది.
ఉప ఎన్నికల్లో భాగంగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో కారును పోలిన 8 గుర్తులున్నాయంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నిక గుర్తుల జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ ఈ గుర్తులను ఎవరికి కేటాయించోద్దని ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో.. టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. దీనిపై నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా మొత్తం 83 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదం పొందాయి.