నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్ రేటింగ్‌లో నిలిచింది. తాజాగా సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని తిరగరాసింది. కేవలం 24 గంటల్లో 10 లక్షల వ్యూస్ సాధించింది.
ఇక రెండో ఎపిసోడ్‌కి అతిథిగా సిద్దూ జోన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేయగా తనదైన శైలీలో ప్రశ్నలతో వారిద్దరిని ఉక్కిరిబిక్కిరి చేశారు బాలయ్య. ఒకడేమో మాస్ కా దాస్, ఒకడేమో మాస్ కా బాస్.. నేనేమో ‘గాడ్ ఆఫ్ మాస్’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది.
ఈ ఎపిసోడ్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎంట్రీ ఇవ్వగా త్రివిక్రమ్ బయట సినిమాలు చేయడా అని బాలయ్య ప్రశ్నించారు. అనంతరం త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు బాలయ్య. షోకు ఎప్పుడు వస్తావని బాలయ్య అడగగా.. మీరు ఎప్పుడు ఒకే అంటే అప్పుడు వస్తానంటూ త్రివిక్రమ్ చెప్పారు. ఎవరితో రావాలో తెలుసుగా అంటూ బాలయ్య అనడంతో..అది పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే అన్నారని అందరికి అర్ధమైంది. ఈ శుక్రవారం ఎపిసోడ్ ప్రసారం కానుంది.

