- Advertisement -
జీజేపీ ఎంపీ అరవింద్‌పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోస్టర్లను దౌర్జన్యంగా తొలగించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశామని టీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు తెలిపారు. అరవింద్ ఓ వీధి రౌడీలా వ్యవహరించారని వారు ఈ సందర్భంగా మీడియా ద్వారా మాట్లాడారు. ఇందులో టీఆర్ఎస్ కార్యదర్శి తాత మధు,లీగల్ సెల్ ప్రతినిధులు కళ్యాణ్,లలితా రెడ్డి,చంద్రశేఖర్ పాల్గొన్నారు.
- Advertisement -