టీఆర్ఎస్‌లో చేరిన సూరారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..

42
trs joings

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై 129 సూరారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేణు గోపాల్ రాజు (జిమ్ వేణు) తన బృందంతో కలిసి పెద్ద ఎత్తున ఈరోజు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్, జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మంత్రి సత్యనారాయణ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం నేతలు మాట్లాడుతూ అభివృద్ధినే ప్రజలు గుర్తిస్తున్నారని, ఇతర పార్టీల హయాంలో రాష్ట్రం ఏ విధంగా ఉందో, టీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. అంతా మేమే చేశామని చెప్పుకునే ఇతర పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్‌పై గులాబీ జెండా తప్ప మరొక జెండా ఎగరదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.