టీఆర్ఎస్‌కు టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ సంపూర్ణ మద్దతు..

54
kavitha

కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు రవాణా రంగానికి రూ.267 కోట్ల మోటారు వాహన పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ ప్రతినిధులు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. కరోనా కాలంలో నష్టపోయిన ప్రతి రంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు.

కరోనా కాలంలో (మార్చి నుండి సెప్టెంబర్) లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ పోర్టు వాహనాల నిర్వహకులు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,37,611 వాహనాలకు సంబంధించిన రూ.267 కోట్ల(రెండు త్రైమాసికాలు) మోటారు వాహన పన్నును మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.