బీజేపీపై టీఆర్ఎస్ ఫిర్యాదు..

119
trs

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలను అందించారు. నియోజకవర్గంలో ఫంక్షన్ హాళ్లను బీజేపీ వాడుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. అలాగే నియోజకవర్గంలో పార్టీ జెండాలు, బ్యానర్ల పేరుతో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పంచుతున్నారని బీజేపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.