కొత్తగా 6,555 పాజిటివ్ కేసులు నమోదు..

127
corona

గడచిన కొన్నివారాలుగా ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోందని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా 6,555 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రం మొత్తమ్మీద పాజిటివ్ కేసుల సంఖ్య 7,06,790కి చేరింది. రాష్ట్రంలో మరో 31 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,900కి పెరిగింది.

తాజాగా, 7,485 మందికి కరోనా నయం అయింది. ఇప్పటివరకు 6,43,993 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 56,897 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 975 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాల్లో 223 కేసులు గుర్తించారు.