టీఆర్‌ఎస్ మద్దతు వైసీపీకి లేనట్టేనా..?

299
- Advertisement -

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఎన్నికల సమయంలో టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు వ్యుహాలను టీఆర్‌ఎస్ తిప్పికొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్‌ విజయం తర్వాత గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌.. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారని హామీ ఇచ్చారు. బాబును ఓడించడానికి టీఆర్‌ఎస్‌ తన మద్దతును వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగంగా ప్రకటించింది.

YS Jagan

అంతేకాదు గత కొద్దిరోజు క్రితం ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైదరాబాద్‌లోని వైయస్ జగన్‌ని ఆయన నివాసంలో కలిశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన బహిరంగంగా టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్‌ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారని, కేసీఆర్‌ ఏపీకి వెళ్లి వైయస్ జగన్‌తో ఈ వ్యవహారంపై చర్చిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ సంఘటనలతో టీఆర్‌ఎస్‌ మద్దతు వైయస్సార్ కాంగ్రెస్‌కే ఉందని స్పష్టంగా కనిపించింది.

అయితే తాజాగా ఈ విషయంలో టీఆర్ఎస్ వైఖరి మారినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ నేతలతో ఓ సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తాము వైసీపీకి అనుకూలంగా ఏపీలో ప్రచారం చేయబోమనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాము ఏపీకి వెళ్లాల్సిన పనిలేదని… అక్కడి ప్రజలే చంద్రబాబును ఓడిస్తారని కేటీఆర్ తెలిపారు. దీంతో ఏపీకి వెళ్లి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలనుకున్న టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

అయితే, టీడీపీ మాత్రం వైయస్ జగన్‌, కేసీఆర్‌ల ప్రచారం తమకు అనుకూలంగా మారుతుందని దుయ్యబట్టారు. అంతేకాదు ఏపీ ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని జగన్‌పై మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కారణంగానే వైసీపీ అనుకూలంగా ఏపీలో ప్రచారం చేయాలనుకున్న టీఆర్ఎస్ తీరులో మార్పు వచ్చిందని.. అందుకే వైఎస్ జగన్ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి కూడా టీఆర్ఎస్ తమ ప్రతినిధులను పంపలేదని గుసగులు మొదలైయ్యాయి. మరి వైసీపీకి మద్దతు ఇచ్చె విషయంలో టీఆర్ఎస్ అభిప్రాయాన్ని మర్చుకుందా? లేకపోతే ఈ వ్యవహారంపై కొంత సమయాన్ని తీసుకోవాలనుకుంటుందా..? అనేది విషయాలు తెలియాల్సివుంది.

- Advertisement -