తెలంగాణ అమ్మాయితో ఆమీర్‌ ఖాన్ ఎఫైర్‌..!

175
- Advertisement -

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్-కిరణ్‌ రావు విడాకుల వ్యవహారం ఇప్పుడు దేశ‌మంత‌టా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ దంప‌తులు అక‌స్మాత్తుగా ఎందుకు విడిపోతున్నార‌నే దానిపై బాలీవుడ్‌లో చ‌ర్చ మొద‌లైంది. ఈ నేపథ్యంలో అమీర్‌ తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, అతి త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు నెట్టింట సెటైర్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.

దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్‌కి కూతురుగా నటించిన నటి ఫాతిమా సన షేక్‌తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నారని.. అందువలనే ఆ నటికి తర్వాత చిత్రమైన “ది థగ్స్ అఫ్ హిందూస్తాన్” చిత్రంలో అమీర్ సరసన నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఫాతిమా ముంబైకి వచ్చిన ప్రతిసారి అమీర్‌ను ఖచ్చితంగా కలుస్తుందని, ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుస గుసలాడుతున్నాయి. ప్రస్తుతం 29 ఏళ్లు ఉన్న ఈ భామ 1992లో హైదరాబాద్‌లో జన్మించి 2016లో చాచి 420, వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో నటించింది.

1986లో రీనా దత్తాని పెళ్లి చేసుకొని సరిగ్గా 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్.. తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం చేసుకొని అదే 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు. 56 ఏళ్ల వయసు ఉన్న అమీర్ ఖాన్ ఈ 29 ఏళ్ల భామను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

- Advertisement -