అట్లీ ప్రేమకథతో యంగ్‌ టైగర్‌..!

120

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ తాజా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత తారక్‌ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళ డైరెక్టర్‌ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అది ప్రేమకథ నేపథ్యంలో సాగే కథ అనే విషయం తాజాగా బయటికి వచ్చింది.

ఇటీవల అట్లీ వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడట. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. అందుకే అతడితో డిఫరెంట్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. ఆ ప్రేమకథ ఎన్టీఆర్ కి నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పై అట్లీ కుమార్ కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ చేయనున్న ఈ ప్రేమకథలోని కొత్త కోణం ఏమిటో చూడాలి.