వైష్ణవ్ తేజ్‌తో చిరు డైరెక్టర్‌..!

35
Varun Tej

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రేక్షకాదరణ పొందిన ప్రేమ కథ చిత్రం ఏదైనా ఉంది అంటే అది ‘ఉప్పెన’ అనే చెప్పాలి. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకి వైష్ణవ్ తేజ్ పరిచయమయ్యాడు. ఈ ప్రేమకథా చిత్రానికి యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ ఒక్క సినిమాతోనే వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు ముందుకు వచ్చాయి. ఆయన తాజా చిత్రం అన్నపూర్ణ బ్యానర్లో రూపొందనుంది. ఆ తరువాత సినిమాను ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోంది.

భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, ‘సంతోషం’ .. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల దర్శకుడు దశరథ్ కథను అందించడం విశేషం. రచయితగా మంచి అనుభవం ఉన్న దశరథ్ అల్లిన కథ కావడంతో అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాతనే ఆయన వైష్ణవ్ తేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.