ట్రోలింగ్ హీరో స్టన్నింగ్ లుక్

31
- Advertisement -

ది లెజెండ్ సినిమాతో కోలీవుడ్ లో హీరోగా పరిచయమైన శరవణన్ ఆ సినిమాతో ట్రోలింగ్ కి గురయ్యాడు. ట్రోల్ చేయడం కోసమే తెలుగులో ఈ సినిమాను చూశారు ఆడియన్స్. తాజాగా ఓటీటీ లో మంచి వ్యూస్ అందుకుంది. అయితే మొదటి సినిమాలో తన లుక్ తో ట్రోల్స్ కి గురైన శరవణన్ తాజాగా స్టన్నింగ్ లుక్ తో హాట్ టాపిక్ అవుతున్నాడు.

శరవణన్ సరికొత్త మెకోవర్ తో అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. విదేశాల్లోకి వెళ్ళి అక్కడ నుండి కొత్త లుక్ తో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో శరవణన్ లేటెస్ట్ ఫోటో ఘాట్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ది లెజెండ్ లో కనిపించిన హీరోనేనా ఇందులో ఉంది ? అంటూ ఫోటోస్ చూస్తూ అందరూ ఆశ్చర్య పోతున్నారు.

శరవణన్ త్వరలోనే ఈ లుక్ తో రెండో సినిమా చేయబోతున్నాడు. కొన్ని రోజుల్లోనే ఆ సినిమా ప్రకటన రాబోతుంది. ఇకపై పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నాడు కోలీవుడ్ హీరో.

ఇవి కూడా చదవండి…

‘బాలయ్య – పవన్’ అభినందనల వెల్లువ

వీరిద్దరూ ఐదో భారతీయులు..

ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్..

- Advertisement -