ఆ కామెంట్స్ పై విశ్వక్ రియాక్షన్

40
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ కి రెడీ అవుతుంది. మార్చ్ 22 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ కి సంబంధించి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు విశ్వక్. తాజాగా కరీంనగర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాడు.

ఈవెంట్ లో ‘ధమ్కీ’ స్టోరీపై చక్కర్లు కొడుతున్న కామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు విశ్వక్. ఈ సినిమా స్టోరీ గౌతం నందా తో పోలిక ఉండనే అలానే మా రైటర్ ప్రసన్న కుమార్ నుండి వచ్చిన ధమాకా కి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రసన్న కి ఒకే కథను రెండు సార్లు అమ్మే టాలెంట్ ఉందని నేను అనుకోవడం లేదంటూ తెలిపాడు.

ఇక అదే వేదికపై రైటర్ ప్రసన్న కూడా విశ్వక్ పాగల్ సినిమా చేశాడు కానీ వచ్చేసిన కథను చేసే పాగల్ కాదని అన్నాడు. ఏదేమైనా విశ్వక్ తన ధమ్కీ ఏ సినిమాకి పోలిక ఉండదని చెప్పాడు. ఇది అతను చెప్పినట్టు కొత్త కథతోనే తెరకెక్కిందా ? చూడాలి. మరి రిలీజ్ తర్వాత సినిమాపై ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయో ?

ఇవి కూడా చదవండి…

ఆస్కార్‌ 2023..విజేతలు వీళ్లే !

వీరిద్దరూ ఐదో భారతీయులు..

ప్రియాంక త్రివేది… ‘డిటెక్టివ్ తీక్షణ’

- Advertisement -