సూపర్ స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్తైన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
మహేశ్ – త్రివిక్రమ్ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ రూ. 5 కోట్ల ఖర్చుతో హైద్రాబాద్ లో ఓ మాసీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఈ సెట్ లోనే జరుగనున్నాయట. ఈ సినిమాకే ఈ సెట్ హైలైట్ అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీత అందిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం మహేశ్ …పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది.