చిరు ఠాగూర్‌కు 18 ఏళ్ళు..

40
chiru

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీల్లో ఒకటి ఠాగూర్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. 2003 సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొత్తం 605 థియేటర్లలో విడుదలలైంది. మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ల షేరు కలెక్షన్స్ కాగా నాలుగు వారాలలో 23.79 కోట్లు రాబట్టింది. మొత్తం 353 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు, 196 సెంటర్లలో 100 శత దినోత్సవ వేడుకలు జరుపుకుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రమణ’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు వి.వి.వినాయక్ చాలా అద్బుతంగా తెరకెక్కించాడు. అవినీతి, లంచం.. వంటి వాటి పై యుద్ధం చెయ్యడానికి ఓ కాలేజీ ప్రొఫెసర్ ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నాడు..

చిరు ఇమేజ్‌కు తగ్గ కథ, డైలాగ్స్‌,డ్యాన్స్‌,ఫైట్స్ ఇలా అన్ని కలిసి రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో హాస్పిటల్ సీన్ ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మణిశర్మ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. మెగాస్టార్ కెరీర్ లో ఇది కూడా గుర్తుండి పోయే చిత్రం అనడంలో సందేహం లేదు.

ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్టే. కొడితే కొట్టాలిరా – చిరు ఇమేజ్‌కి త‌గిన పాట‌. ఈ పాట‌లో ర‌క్తం పంచిన త‌మ్ముళ్లే మీరు.. అనే మాట‌.. ఫ్యాన్స్‌కి పూన‌కం తెప్పించింది. మ‌న్మ‌థా మ‌న్మ‌థా మామ పుత్రుడాలో.. చిరు వీణ స్టెప్పుని కొన‌సాగించాడు. ఇక ఈ సినిమాతో చిరు తన గ‌త రికార్డుల‌నే కాదు, అప్ప‌టి వ‌ర‌కూ తెలుగు నాట వ‌చ్చిన రికార్డుల‌న్నీ చెరిపేసి కొత్త చ‌రిత్ర సృష్టించారు.

ఇక ఒరిజినల్ ‘రమణ’ క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. తెలుగులో హీరో చనిపోతే ప్రేక్షకులకు నచ్చదు. దీంతో ఒక హైకోర్టు జడ్జి ని కలిసి అతని సలహా తీసుకున్నారు. హీరో చనిపోకుండా జైలు శిక్ష పడేలా తెలుగులో కథను తయారు చేశారు. ఓవరాల్‌గా సినిమా వెండితెరపై ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.