బంపర్ ఆఫర్…త్రివిక్రమ్‌తో నవీన్!

28
trivikram

జాతిరత్నాలుతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి బంపర్ ఛార్స్ కొట్టేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ మేరకు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ని ప్రారంభించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఫార్చ్యూన్ 4 సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

Production No 15 Announcement - Naveen Polishetty | Kalyan Shankar | #NP4