డ్రగ్స్ కేసు..ఈడీ ముందుకు ముమైత్

28
mumaith

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌, నవదీప్‌లను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ ముమైత్‌ ఖాన్‌ను విచారించనున్నారు. ఈ మేరకు ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు ముమైత్.

మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి పెట్టారు. కెల్విన్‌తో ఆమెకున్న సంబంధాల గురించి ఈడీ ఆఫీసర్స్ లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కెల్విన్‌తో ఎలాంటి పరిచయాలున్నాయి? అనేదానిపై ఆరా తీయనున్నారు.

సెప్టెంబర్ 17న తనీశ్, 22న తరుణ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు.