బిగ్ బాస్ 5…మెడికల్ రూమ్‌లో లోబో!

19
lobo

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా సాగుతోంది. రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు మధ్య పెద్ద గొడవకు దారితీసింది. ఆడ,మగ అనే తేడా లేకుండా ఇంటి సభ్యులు ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు.

కెప్టెన్ కంటెండర్ టాస్క్‌ కోసం దొంగ‌లున్నారు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులను రెండు టీమ్స్‌గా విడ‌గొట్టాడు బిగ్‌బాస్‌. మాన‌స్, ర‌వి, న‌ట‌రాజ్‌మాస్ట‌ర్‌, జెస్సీ, కాజ‌ల్‌, ఉమ, ల‌హ‌రి, స‌న్ని, శ్వేత ఉన్న టీమ్‌కి మాన‌స్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. శ్రీరామ్‌, విశ్వ‌, ష‌ణ్ముక్‌, సిరి, హ‌మీదా, యానీ మాస్ట‌ర్‌, ప్రియాంక‌, ప్రియ, లోబో ఓ టీమ్‌కి శ్రీరామ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. రెండు టీమ్స్‌కు సంబంధించిన డ‌గౌట్స్‌లో పిల్లోస్ ఉంచాడు.

ప్ర‌త్య‌ర్థి టీమ్‌లో పిల్లోస్‌ను త‌మ టీమ్‌లోకి తెచ్చుకుంటూనే త‌మ టీమ్‌కు చెందిన పిల్లోస్‌ను కాపాడుకోవ‌డ‌ట‌మే ఈ గేమ్‌. ఈ సందర్భంగా ఆటలో భాగంగా ఒకరినొకరు తోసుకోగా లోబో కింద‌ప‌డిపోయాడు. ముందు టీమ్ స‌భ్యులు ప‌ట్టించుకోలేదు. కానీ, చివ‌ర‌కు డాక్ట‌ర్‌ను పిలిపించాల‌ని కోరారు. దీంతో లోబోను బిగ్‌బాస్ మెడిక‌ల్ రూమ్‌కి పిలిపించాడు. ట్రీట్‌మెంట్ త‌ర్వాత మ‌ళ్లీ లోబో ఇంట్లోకి వ‌చ్చాడు. సిగ‌రెట్స్ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల‌నే లోబోకి అలా అయ్యింద‌ని, సిగ‌రెట్స్ తాగ‌వ‌ద్ద‌ని ర‌వి చెప్ప‌డంతో, తానిక సిగ‌రెట్స్ తాగ‌న‌ని లోబో ప్రామిస్ చేశాడు.