త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హీరో రామ్‌!

275
trivikram
- Advertisement -

అరవింద సమేత తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. ఇప్పటికే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తర్వాత హీరో రామ్‌తో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ కు త్రివిక్రమ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన నువ్వే నువ్వే చిత్రాన్ని నిర్మించింది రవికిశోరే. ఆ అనుబంధంతోనే రామ్ తో సినిమా చేయాలని అడిగాడట త్రివిక్రమ్.

దీంతో రామ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు త్రివిక్రమ్. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -